IND vs PAK: అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త..

IND vs PAK: అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త..
భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు!

క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్‌కు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు భారతీయ రైల్వే ప్రకటించింది.

భారత్, పాకిస్తాన్‌ మధ్య ఏ మ్యాచ్‌ ఆడుతున్న క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఈసారి వరల్డ్ కప్‌ టోర్నీలో ఈ దాయాది జట్లు తలపడబోతున్నాయి.


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీమ్యాచ్ స్టేడియంలో పాక్‌, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. మ్యాచ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ అహ్మదాబాద్ వెళ్లేందుకు విమాన టిక్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీమ్యాచ్ స్టేడియంలో పాక్‌, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. మ్యాచ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ అహ్మదాబాద్ వెళ్లేందుకు విమాన టిక్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోటల్ ఛార్జీలు ఇప్పటికే 10 రెట్లు అయ్యాయి. భారత్‌ పాక్‌ మ్యాచ్‌ జరిగే అక్టోబర్ 14న ఒక్క రాత్రికి హోటల్ గదిలో బస చేసేందుకు ఒక్కరికి రూ. 30,000 నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.


ఆ రోజున వందే భారత్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాలను వెల్లడించనున్నామన్నారు. భారత్ - పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటళ్ల ధరలు భారీగా పెరగడం, విమాన టిక్కెట్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.

Tags

Next Story