2030 నాటికి రూ .20 లక్షల కోట్లకు భారత ఈవీ మార్కెట్ : నితిన్ గడ్కరీ

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇదే స్థాయిలో కొనసాగితే 2030 నాటికి దేశ ఈవీ మార్కెట్ విలువ రూ. 20 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, అదే సమయానికి ఏటా కోటి ఈవీ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేశారు. మంగళవారం జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) వార్షిక సదస్సులో మాట్లాడిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ.. 2030 నాటికి ఈవీ ఫైనాన్సింగ్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్లకు చేరవచ్చని, అలాగే, భారత ఆటోమొబైల్ రంగం 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం ఉందన్నారు. ప్రసుత్తం దేశంలో 30 లక్షల ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం అమ్మకాల్లో 56 శాతం టూ-వీలర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఈవీ విక్రయాలు 45 శాతం పెరిగాయని గడ్కరీ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com