Hydrogen Train: మనదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఈ నెల 31 నుంచే ..

భారతదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే ఉంది. బ్రిటీష్ వాళ్ళు మొదలెట్టిన ఈ వ్యవస్థ కాలంతో పాటూ పరుగులు తీసింది. ప్రయాణికులు మాత్రమే కాకుండా సరుకు రవాణాను కూడా అతి తక్కువ ధరలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వేలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే సర్వీసులు..డీజిల్, విద్యుత్ ఇలా రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్స్ కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి.
హైడ్రోజన్ తో నడిచే మొట్టమొదటి రైలు ఈ నెల 31వ తేదీన ప్రారంభమవనుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ ఈ రైలును రూపొందించింది. జింద్ నుంచి సోనిపట్ మధ్య దూరం 90 కిలోమీటర్లు. దీని తరువాత ఇలాంటివి మరో 35 రైళ్ళను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ డిసైడ్ అయింది. హైడ్రోజన్ తో నడిచే రైళ్ళ వలన పర్యావరణానికి మరింత మేలు చేకూరుతుందని చెబుతోంది.
హైడ్రోజన్ రైళ్లు నీటితో నడుస్తాయి. హైడ్రోజన్, ఆక్సిజన్‌లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. వాటి ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీతో ట్రైన్స్ ను నడుపుతారు. మొత్తం 40 వేల నీటిని ఇవి ఉపయోగించుకుంటాయి. దీని వేగం గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అంతేకాదు హైడ్రోజన్ ట్రైన్ సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని రైల్వేశాఖ వివరాలు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com