Prabal : తేలికైన దేశీయ రివాల్వర్.. మహిళలకు కూడా

Prabal : తేలికైన దేశీయ రివాల్వర్.. మహిళలకు కూడా
భద్రత దళాల చేతికి మరో కొత్త ఆయుధం

మన దేశానికి చెందిన ఓ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రూపొందించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్. ‘ప్రబల్' అనే పేరున్న ఈ రివాల్వర్ ఆగస్టు 18న విడుదల కానుంది. ఇంతకు ముందు తయారుచేసిన రివాల్వర్ కంటే ఈ ప్రబల్ రివాల్వర్ రేంజ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏడబ్ల్యూఈఐఎల్ తేలిపింది. ఎందుకంటే గతంలో దేశీయంగా తయారైన రివాల్వర్ల రేంజ్ కేవలం 20 మీటర్లు మాత్రమే. కానీ ఈ ప్రబల్ రివాల్వర్ తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా గురిపెట్టవచ్చు.

ఈ ప్రివాల్వర్ 76 మి.మీ బ్యారెల్ తో చక్కగా 700 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. కాబట్టి మహిళలు కూడా భద్రత కోసం సులభంగా తమతో తీసుకెళ్లవచ్చు. ఈ ప్రబల్ రివాల్వర్ బుకింగ్స్ ఆగస్టు 18 వ తేదీ నుండి మొదలవుతున్నాయు. లైసెన్స్ కలిగి ఉన్న సామాన్యులు సైతం ఈ ప్రబల్ రివాల్వర్ ను కొనుగోలు చేయవచ్చు.

AWEIL అనేది కాన్పూర్‌లోని అర్మాపూర్‌లో రక్షణ ఉత్పత్తులను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ భారత భద్రతా దళాల, సాయుధ దళాలు, విదేశీ సైన్యాలు, దేశీయ పౌర అవసరాల కోసం ఆయుధాలు మరియు తుపాకులను తయారు చేస్తుంది. ఈ 2023 సంవత్సరంలో ఈ సంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది. వీటిలో భారత సైన్యం కోసం 300 సారంగ్ ఫిరంగుల తయారీ కాగా, యూరోపియన్ దేశాలకు సంబంధించి రూ.450 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీ ఆర్డర్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story