India's Population : రాబోయే 30 ఏళ్లలో భారత జనాభా 170 కోట్లు : ఐక్యరాజ్యసమితి అంచనా

Indias Population : రాబోయే 30 ఏళ్లలో భారత జనాభా 170 కోట్లు :  ఐక్యరాజ్యసమితి అంచనా
X

భారత దేశ జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. తర్వాత 12 శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది. అయితే, ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు ‘వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2024’ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే 50–60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1,030 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అక్కడినుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1,020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనాను దాటేసిన భారత్‌ 2100వ ఏడాది వరకు అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది. 2024లో మన దేశ జనాభా 145 కోట్లని అంచనా వేసింది. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది.

Tags

Next Story