Narendra Modi : పాక్‌పై భారత్ సంచలన విజయం.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావించిన ప్రధాని మోదీ..

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అపురూప విజయంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది భారత అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కేవలం 146 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
భారత్ విజయంలో యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. తిలక్ వర్మ (69* పరుగులు, 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చివరి వరకు నిలబడగా అతనికి శివమ్ దూబే (33 పరుగులు, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సహకారం అందించారు. వీరిద్దరి మెరుపులతో భారత్ విజయం సులువైంది.
విజయంపై ప్రధాని మోదీ ప్రత్యేక స్పందన చిరకాల ప్రత్యర్థిపై భారత్ సాధించిన ఈ అద్భుత విజయంపై సామాన్యుల నుంచి ప్రధాని వరకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. ఈ విజయాన్ని ఇటీవల జరిగిన దేశ రక్షణ చర్యలతో ముడిపెడుతూ ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. "మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్ ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్' నేపథ్యం ప్రధాని మోదీ ప్రస్తావించిన ఆపరేషన్ సిందూర్‌కు నేపథ్యం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది భారత పౌరులను పాక్ తీవ్రవాదులు బలిగొన్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7 నుంచి 10 వరకు పాక్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ అనంతరం పాక్ చేసిన దాడులను తిప్పికొట్టిన భారత్, ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com