IndiGo Flight : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

IndiGo Flight : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
X

ఇండిగో విమానం ఢిల్లీలో ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ ల్యాండింగ్ ను రద్దు చేయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాయ్పూర్ నుంచి ఢిల్లీలోని ఇంది రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తు న్న ఇండిగో విమానం 6ఈ 6313 ల్యాండింగ్కు కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసు కుంది. విమానం నేలను తాకే సమయంలో వాతా వరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరడంతో విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ సురక్షితం కాదని భావించి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానం లోపల ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కిటికీ నుంచి చూస్తే బయట ఏమీ కనిపించనంతగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5:05 గంటలకు ల్యాండ్ కావాల్సిన విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం 5:43 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.

Tags

Next Story