Indore: క్లీన్ సిటీగా ఇండోర్.. వరుసగా 8వ సారి రికార్డ్ సొంతం

పరిశుభ్రతలో ఇండోర్ పట్టణం మరోసారి రికార్డ్ సొంతం చేసుకుంది. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా వరుసగా ఎనిమిది సార్లు పరిశుభ్రతలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యంత క్లీన్ సిటీగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తొలి స్థానం దక్కించుకుంది. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. గతేడాది ఇండోర్‌తో పాటు సూరత్ కూడా తొలి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సారి మాత్రం ఇండోర్ తొలి స్థానం సంపాదించుకోగా.. సూరత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మూడో స్థానంలో నవీ ముంబై నిలిచింది.
3-10 లక్షల జనాభా జాబితాలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవతరించింది. తర్వాత చండీగఢ్, మైసూర్ నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గృహ, పట్టణ వ్యహరాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన పలు కేటగిరీల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com