IRCTC : ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే 5 రోజుల విదేశీ యానం.. వీసా, ఫుడ్ అన్నీ ఫ్రీ.

IRCTC : ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే 5 రోజుల విదేశీ యానం.. వీసా, ఫుడ్ అన్నీ ఫ్రీ.
X

IRCTC : ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం IRCTC ఒక బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశభక్తిని చాటుకుంటూనే, విదేశీ గడ్డపై విహరించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. దుబాయ్ నగరాన్ని చుట్టేసి రావడానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖర్చు, సందర్శించే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

దుబాయ్‌లో భారతీయ ఐక్యత

ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ దుబాయ్‌లో ఒకే చోట చేర్చి, మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం. బెంగళూరు, కోచి, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుంచి పర్యాటకులు ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అందరినీ దుబాయ్‌లో కలిపి ఒక గ్రూప్‌గా ఐఆర్సీటీసీ తిప్పుతుంది.

ధర, లభించే వసతులు

4 రాత్రులు, 5 పగళ్ల పాటు సాగే ఈ విదేశీ యానానికి ఒక్కొక్కరికి రూ.94,730 గా ధర నిర్ణయించారు. ఈ ఖర్చులోనే మీకు విమాన టిక్కెట్లు, త్రీ-స్టార్ హోటల్‌లో బస, వీసా ఛార్జీలు, ప్రతిరోజూ భోజనం వంటివన్నీ కలిసి ఉంటాయి. వీటితో పాటు ఏసీ లగ్జరీ బస్సుల్లో సైట్ సీయింగ్, ఎడారి సఫారీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది. అదనపు ఖర్చుల టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దుబాయ్ అందాలను ఆస్వాదించవచ్చు.

ఏమేం చూడవచ్చు?

ఈ ప్యాకేజీలో భాగంగా దుబాయ్ సిటీ టూర్, పామ్ జుమేరా, మిరాకిల్ గార్డెన్, ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా వద్ద లైట్ అండ్ సౌండ్ షో చూపిస్తారు. షాపింగ్ ప్రియుల కోసం గోల్డ్ సూక్, స్పైస్ సూక్ మార్కెట్లకు తీసుకెళ్తారు. అంతేకాకుండా అబుదాబీ సిటీ టూర్‌లో భాగంగా ప్రసిద్ధ షేక్ జాయెద్ మసీదు, అక్కడి హిందూ దేవాలయాన్ని కూడా సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.

బుకింగ్ ఎలా చేసుకోవాలి?

ఈ అద్భుతమైన ప్యాకేజీ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనవరి 6, 2026 వరకు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా ఆన్‌లైన్‌లో మీ సీటును రిజర్వ్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్‌ను దుబాయ్ బుర్జ్ ఖలీఫా నీడలో ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

Tags

Next Story