New State : దేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పడబోతోందా?

దేశంలో మరో కొత్త రాష్ట్రం లేదా UT ఏర్పడబోతోందా? బెంగాల్ పాలిటిక్స్‌ను పరిశీలిస్తే కాదనలేం! ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. నార్త్ బెంగాల్‌ను విడదీసి ఈశాన్య భారతంలో కలపాలని ప్రతిపాదించారు. అప్పుడే పాలన, సాంస్కృతిక, సంక్షేమ, ఆర్థిక న్యాయం జరుగుతుందన్నారు. నిప్పు లేనిదే పొగ రాదు. ఈ డిమాండ్ ఇప్పుడే ఎందుకొచ్చింది? కావాలనే విభజన నెరేషన్ బిల్డ్ చేస్తున్నారా?
నార్త్ బెంగాల్ డిమాండ్ కొత్తదేం కాదు. బ్రిటిషర్లూ దీని విశిష్టతను గుర్తించే ప్రత్యేకంగా పరిపాలించారు. టీ తోటలు, సహజ వనరులు, కొండలు, విదేశాలతో సరిహద్దులుండటం దీని స్పెషాలిటీ. దేశ రక్షణకిది వ్యూహాత్మక ప్రాంతం. నిజానికి బెంగాల్ మొత్తం కోల్‌కతా కేంద్రంగా డెవలప్ చేశారు. పరిశ్రమలన్నీ దానిచుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, మౌలికం, పరిపాలన, ఉపాధి, పథకాలు ఇక్కడి ప్రజలకే మెరుగ్గా అందుతున్నాయి.
నార్త్ బెంగాల్లో డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్‌గుడి, అలీపుర్దార్, కూచ్ బెహార్ జిల్లాలు ఉంటాయి. నార్త్, సౌత్ దినాజ్‌పుర్, మాల్దాలోని కొన్ని ప్రాంతాలు కలుస్తాయి. సౌత్‌తో పోలిస్తే ఇక్కడి ప్రజల సంస్కృతి చాలా భిన్నం. నేపాల్, భూటాన్, బంగ్లా ప్రభావం కనిపిస్తుంది. ఈశాన్య భారతంతో సత్సంబంధాలు ఉంటాయి. అందుకే అందులో కలిపేస్తే ప్రత్యేక ప్యాకేజీ అమలవ్వడమే కాకుండా మరింత డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజల కోరిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com