Isha Ambani and Akash Ambani : ఇషా అంబానీ, ఆకాష్​ సరికొత్త రికార్డు

Isha Ambani and Akash Ambani : ఇషా అంబానీ, ఆకాష్​ సరికొత్త రికార్డు
X

హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. 2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్‌తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్‌చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్‌దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు.

Tags

Next Story