ISRO : ఇస్రో ప్రయోగం విజయవంతం

ISRO : ఇస్రో ప్రయోగం విజయవంతం
X

శ్రీహరికోటలోని షార్‌ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలను ఈవోఎస్‌-08 పర్యవేక్షించనుంది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు.

Tags

Next Story