ISRO's Upcoming Missions : ఇస్రో నెక్స్ట్ ప్రయోగాలు ఇవే.. రాసి పెట్టుకోండి

ISROs Upcoming Missions : ఇస్రో నెక్స్ట్ ప్రయోగాలు ఇవే.. రాసి పెట్టుకోండి
X

ఇస్రో ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ -డికి ప్రయోగం విజయవంతం కావడంతో ఈ ఏడాది వరుస విజయాలతో ఇస్రో హ్యాట్రిక్ సాధించింది. జనవరిలో పీఎస్ఎల్వీ-సీ58 ద్వారా ఎకోశాట్ ప్రయోగం, ఫిబ్రవరిలో జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ద్వారా ఇన్ శాట్- 3డీఎస్ ప్రయోగంను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ క్రమంలో నాసా సహకారంతో అభివృద్ధి చేసిన లోఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ ఉన్నాయి. మరో ప్రధాన మిషన్ గగన్ యాన్ ను ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ తెలియజేశారు.

దీని ద్వారా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ను 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యకు పంపించి, మూడు రోజుల తరువాత వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఆక్సియోమ్ -4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే చారిత్రాత్మక ప్రయాణంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. అతను మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు.

ఈ మిషన్ పూర్తయిన తరువాత ఈ ప్రయాణం చేసిన మొదటి భారతీయ వ్యోమగామిగా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా నిలుస్తారు.

Tags

Next Story