Sonu Sood : నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనడం అబద్ధం: సోనూ సూద్

తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలు అబద్ధమని నటుడు సోనూ సూద్ ట్విటర్లో తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని పోస్ట్ పెట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది అనేది వార్తల సరాంశం. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com