Jagdeep Dhankhar : మాజీ ఎమ్మెల్యే పింఛనుకు దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్

X
By - Manikanta |30 Aug 2025 6:00 PM IST
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ అసెంబ్లీ అధికారులు ధృవీకరించారు. జగదీప్ ధన్‌ఖడ్ 1993 నుంచి 1998 వరకు రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యే వరకు మాజీ ఎమ్మెల్యేగా పింఛను అందుకున్నారు. అయితే, ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత, తిరిగి మాజీ ఎమ్మెల్యే పింఛను కోసం రాజస్థాన్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు కావడంతో, రాజస్థాన్ నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు సుమారు రూ. 42,000 పింఛను లభించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com