Indian Foreign Minister : ఆప్గన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. భారత్ కొత్త వ్యూహం

Indian Foreign Minister : ఆప్గన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. భారత్ కొత్త వ్యూహం
X

భారత్-పాకిస్తాన్ దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నది. అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమీర్ ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చర్చలు జరిపారు. గురువారం తనతో ముత్తాఖీ ఫోన్లో మాట్లాడిన విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి.

'అఫ్గాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాఖీతో మంచి సంభాషణ జరిగింది. పహల్గాంలో ఉగ్రవాద దాడిని ఆయన ఖండించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అని జైశంకర్ చెప్పారు. 'భారత్-అఫ్గానిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీ వల అవాస్తవ, నిరాధార ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నాను. అఫ్గాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం' అని జైశంకర్ రాసుకొచ్చారు. పహల్గంలో దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న వైరం నేపథ్యంలో ఏప్రిల్ 27న కాబూల్లో సీనియర్ భారత దౌత్యవేత్త ఆనంద్ ప్రకాషకు ముత్తాఖ్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Next Story