Jammili Elections : జమిలి జేపీసీ గడువు పెంపు

జమిలి ఎన్నికల కోసం ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువును పెంచుతూ ఇవాళ లోక్ సభ తీర్మానం చేసింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. వర్షా కాల సమావేశాల చివరివారంలో తొలిరోజు వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ను కేంద్రం లోక్సభ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైంది. ఈ జేపీలో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. కమిటీ కా లపరిమితి వచ్చేనెల 4న ముగియనుంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నందున గడువు పెంచుతూ ప్ర వేశపెట్టిన తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com