CM Omar Abdullah : సైన్యాధికారిని ప్రశంసించిన జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

ఇండియన్ ఆర్మీ దెబ్బకు కకావికలమైన పాక్ సైన్యం భారత సరిహద్దులో విచ్చలవిడిగా కాల్పులకు పాడుతోంది. అత్యాధునిక డ్రోన్ బాంబులు, మిస్సైల్స్‌ను ప్రయోగిస్తుంది. తెల్లవారుజామున రాజౌరి ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్‌కుమార్ తప్పా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) తాజాగా స్పందించారు. రాజౌరి నుంచి ఓ భయంకర వార్త వచ్చిందని.. మనం జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోయామని అన్నారు.
రాజ్‌కుమార్ తప్పా శక్రవారం డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లాలో పర్యటించారని.. తాను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశానికి కూడా హాజరయ్యారు పేర్కొన్నారు. ఇవాళ ఆయన నివాసంపై పాక్ కాల్పులు జరిపిందని.. రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని మన అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తప్పాను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రాణనష్టం పట్ల నేను షాక్‌లో ఉన్న.. రాజ్ కుమార్ తప్పా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా.. అంటూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com