Jaya Bachchan : మరోమారు రాజ్యసభకు జయా బచ్చన్

Jaya Bachchan : మరోమారు రాజ్యసభకు జయా బచ్చన్

లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ (Rajya Sabha) స్థానాలు ఖాళీ అవుతున్నాయి, వీటికి ఈ నెలాఖరులో ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే టైమ్ ఉంది.

దీంతో యూపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ మరోమారు జయ బచ్చన్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆమెతో పాటుగా మరో ఇద్దరి పేర్లను ఈరోజు వెల్లడించనున్నారు.

మరోవైపు అధికార బీజేపీ తన కోటాలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆర్పీఎన్ సింగ్, సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్వీర్ సింగ్, సాధన సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, నవీన్ జైన్‌లను రాజ్యసభకు నామినేట్ చేయనుంది. యూపీ నుంచి 10 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా, అందులో ఏడు సీట్లు బీజేపీకి, మూడు సీట్లు సమాజ్‌వాదీ పార్టీకి దక్కనున్నాయి.

రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Next Story