Jio : జియో యూజర్లకు కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Jio : రిలయన్స్ జియో తన 4G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తూనే అదిరిపోయే కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న పాత ప్లాన్లను తొలగించి, వాటి స్థానంలో సరికొత్త 4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్ కేటగిరీని ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అభ్యంతరాల నేపథ్యంలో జియో తన వ్యూహాన్ని మార్చుకుంది. దీనివల్ల జియో భారత్ ఫోన్ లేదా జియో 4G కీప్యాడ్ ఫోన్లు వాడుతున్న వారికి ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ మారాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని రోజుల క్రితం డివైజ్ స్పెసిఫిక్ (అంటే కొన్ని ఫోన్లకు మాత్రమే వర్తించే) ప్లాన్ల విషయంలో పారదర్శకత లేదని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన రిలయన్స్ జియో, పాత జియోభారత్ ప్లాన్ల పేరు మార్చడమే కాకుండా, జియోఫోన్ కోసం విడిగా ఉన్న ప్లాన్లను పూర్తిగా తొలగించింది. ఇప్పుడు కేవలం 4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్ పేరుతో అందరికీ ఒకే రకమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.
కొత్త ప్లాన్ల వివరాలు
జియో ఫీచర్ ఫోన్ కొత్త ప్లాన్లు ఇప్పుడు రూ. 123 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 0.5 GB డేటా, నెలకు 300 SMSలు లభిస్తాయి.
* రూ.234 ప్లాన్: 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.
* రూ.369 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.
* రూ.1234 వార్షిక ప్లాన్: ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ కోరుకునే వారి కోసం. 336 రోజుల వ్యాలిడిటీతో రోజూ 0.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
డేటా యాడ్-ఆన్స్, బూస్టర్లు
ఒకవేళ రోజూ వచ్చే డేటా అయిపోతే వినియోగదారులు అదనంగా డేటా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికోసం రూ.26 కే 2GB డేటా, రూ.62 కు 6GB డేటా ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ఇవి కాకుండా రూ.86, రూ. 122, రూ. 182 ప్లాన్లలో రోజువారీ డేటా బూస్టర్ సౌకర్యం కూడా ఉంది. అలాగే కొత్తగా 4G ఫీచర్ ఫోన్ కొనేవారికి కేవలం రూ. 21 కే 4 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ను జియో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.
పాత ప్లాన్లకు చెల్లుచీటీ
ఈ కొత్త మార్పుల వల్ల గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన రూ.91 ప్లాన్ ను జియో నిలిపివేసింది. దీనివల్ల కనీస రీఛార్జ్ ధర రూ.91 నుండి రూ.123కి పెరిగినట్లయింది. అయితే ప్లాన్లను మరింత స్పష్టంగా, యూజర్లకు అర్థమయ్యేలా మార్చడమే తమ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే కీప్యాడ్ ఫోన్ వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్లు ఇప్పటికీ లాభదాయకమే అని చెప్పవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
