Jio : జియో బంపర్ ఆఫర్.. రూ.198కే అన్ లిమిటెడ్ 5జీ డేటా, కాలింగ్.

Jio : రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వాడకందారుల కోసం అనేక చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ. 200 లోపు అన్ లిమిటెడ్ 5జీ డేటా అందించే ఒక ప్లాన్ గురించి తెలుసుకుందాం.. జియో రూ. 198 ప్లాన్‌లో డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ. 198 ప్లాన్‌తో జియో మీకు ప్రతి రోజు 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అయితే, మీరు కంపెనీ 5జీ సేవలు ఉన్న ప్రాంతంలో నివసిస్తూ, మీ ఫోన్ కూడా 5జీ సేవలకు సపోర్టు చేస్తే ఈ అన్ లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది కాకుండా ఈ ప్లాన్‌తో కంపెనీ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్‌టీడీ) ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కేవలం రోజువారీ డేటా మాత్రమే కాకుండా ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.
రూ. 198 ప్లాన్‌తో జియో 28 రోజుల వ్యాలిడిటీ ఇవ్వదు. ఈ ప్లానులో కేవలం 14 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజు 2 జీబీ డేటా లెక్కన, మీరు 14 రోజులలో సుమారు 28 జీబీ హై-స్పీడ్ డేటాను రూ. 198కే పొందుతారు. రూ. 198 ఖర్చు చేసిన తర్వాత మీకు ప్రతి రోజు డేటా, ఎస్‌ఎంఎస్‌లు, కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కాకుండా, జియో టీవీ, జియో క్లౌడ్లకు ఫ్రీ యాక్సెస్ కూడా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ (Airtel) వద్ద రూ. 198 ప్లాన్ లేనప్పటికీ, రూ. 199 ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే, ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని అందించదు. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ మీకు కేవలం 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో స్పామ్ అలర్ట్స్, ఉచిత హెలోట్యూన్, పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రయోజనం కూడా లభిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

