Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే ప్రకటన

Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే ప్రకటన
X

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ డీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లనున్నా రు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీ ఎంకేఎంఎస్ఎం కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాయి. దేశంలో ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నా యి. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు సీట్లు ఇందులో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్, ఎం షణ్ముగమ్, ఎన్ చంద్రశేగరన్, ఎం మహమ్మద్ అబ్దుల్లా, పీ విల్సన్, వైగో రాజ్యసభ పదవీకాలం జులై 25తో ముగిసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ లో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో నాలుగు స్థానాలనూ ఆ పార్టీనే దక్కిం చుకుంటుందని తెలుస్తోంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రా ష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎస్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వం లోని కూటమి అంగీకరించింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Tags

Next Story