Kangana Ranaut : రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి : ఎంపీ కంగనా రనౌత్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. ప్రధాని కాలేకపోతే దేశాన్ని నాశనం చేయడమే ఆయన అజెండా అని దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘దేశ భద్రత, ఆర్థిక స్థితిని అస్థిర పరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారు. ఆయనను ఎప్పటికీ నాయకుడిగా చేసుకోరు’ అని అన్నారు.
దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ.. అన్నింటినీ అస్థిరపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కంగనా చెప్పారు. భారతీయుల దేశభక్తి, జాతీయవాదం కారణంగా రాహుల్ గాంధీ ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ప్రజల్లో దేశ భక్తి మరింత పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందని వివరించారు. రాహుల్ ను ప్రజలు ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోబోరని చెప్పారు. జీవిత పర్యంతం ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు సిద్ధమవ్వాలంటూ రాహుల్ గాంధీకి కంగనా సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com