Kangana Ranaut : మోడీపై లోక్ సభలో కంగన హాట్ కామెంట్స్

Kangana Ranaut : మోడీపై లోక్ సభలో కంగన హాట్ కామెంట్స్
X

ప్రధాని మోడీపై ( Narendra Modi ) ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్య వస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా చెప్పారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడారు.

"నేను ఈ పార్లమెంటుకు కొత్త సభ్యురాలిని, కానీ ఇటీవలి ఎన్నికల ప్రాముఖ్యత గురించి నాకు బాగా తెలుసు. మోదీ వరుసగా మూడుసార్లు గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు. పదేళ్ల క్రితం మన ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసునని.. దేశం మొత్తం ఆందోళన చెందిందని.. అయితే 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుని ఇప్పుడు మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని అన్నారు.

తన ప్రసంగంలో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ సవాళ్లను కూడా ప్రస్తావించారు. జీరో అవర్లో హిమాచల్ ప్రదేశ్లో వరద సంక్షోభంపై కంగనా రనౌత్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. "గత ఏడాది పెద్ద వరదలు ఎదుర్కొన్నాం. కానీ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతోంది" అని తెలిపారు. మండిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని.. పర్యాటకాన్ని పెంచాలని కంగన కోరారు.

Tags

Next Story