Kangana Ranaut : కంగన తొలి ప్రసంగం.. ఏం మాట్లాడారో తెలుసా?

హిమాచల్ లోని మండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటి కంగన తొలిసారి లోక్ సభలో ప్రసంగించారు. తమ రాష్ట్రంలో గిరిజన సంగీతం, జానపద కళలు అంతరించిపోతున్నాయని తెలిపారు. సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆమె తొలుత స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
"మండిలో వివిధ కళా రూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్లో కత్-కుని అనే హస్తకళ ఉంది. గొర్రె చర్మాన్ని జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెట్జర్లు వంటి పలు రకాల దుస్తుల తయారీకి వినియోగిస్తారు. వీటికి విదేశాల్లో ఎంతో విలువున్నప్పటికీ, ఇక్కడ మాత్రం అంతరించిపోతున్నాయి. అందువల్ల వీటికి ప్రోత్సాహమిచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్పతి, కిన్నౌర్, భర్మౌర్ లోని గిరిజన సంగీతం, వారి జానపదం, కళారూపాలు అంతరించి పోతున్నాయి" అని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కంగన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com