డీఎంకే "దీపం" రాజకీయాలు.. ఇదేం సెక్యులరిజం..?

డీఎంకే దీపం రాజకీయాలు.. ఇదేం సెక్యులరిజం..?
X

తమిళనాడులోని తిరుపారన్ కుండ్రం కొండ సుబ్రమణ్య స్వామి టెంపుల్ లో కార్తీక దీపం పండుగ సందర్భంగా ఏర్పడిన వివాదం సంచలనగా మారింది. ఈ కొండమీద సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఉంది. దాని కింద ప్రతిస్తంభం ఉంటుంది అక్కడే కార్తీక దీపం వెలిగించాలనేది ఎప్పటినుంచో ఉన్న ఆచారం. దీనికి 50 మీటర్ల దూరంలో హజ్రత్‌ సుల్తాన్‌ సికందర్‌ బాషా అవులియా అనే దర్గా ఉంది. ఈ రాతి స్తంభం దగ్గర కార్తీకదీపం వెలిగించుకోవచ్చని జీ.ఆర్.స్వామినాథన్ డిసెంబర్ 1, 2025న తీర్పు ఇచ్చారు. కానీ దాన్ని స్టాలిన్ ప్రభుత్వం అమలు చేయలేదు. పక్కనే దర్గా ఉంది కాబట్టి ఘర్షణలు అవుతాయని చెప్పింది. దీని మీద పిటిషనర్ మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన స్వామినాథన్.. తమిళనాడు పోలీసులు రానివ్వట్లేదు కాబట్టి దీపం వెలిగించేవాళ్లు సీఐఎస్ ఎఫ్ బృందాలతో వెళ్లి డిసెంబర్ 4న సాయంత్రం వెలిగించొచ్చు అని మళ్లీ ఆర్డర్ ఇచ్చారు. కానీ దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన అక్కడ స్టే రాలేదు. కానీ హైకోర్టు ఆదేశాలను డీఎంకే పార్టీ పాటించలేదు. ఈ వివాదం మీద పవన్ కల్యాణ్​ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. డీఎంకే, కాంగ్రెస్ లాంటి పార్టీలు సూడో సెక్యూలరిజమ్ పేరుతో న్యాయమూర్తులనే బెదిరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో శబరిమల ఆలయంలో ప్రధానమైన ఆచారాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని తొలగించాలని మేమేమైనా అన్నామా. రీసెంట్ గా దేవుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన న్యాయమూర్తిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశామా.. కానీ హిందూ మతానికి ఓ న్యాయమూర్తి సపోర్ట్ చేస్తే ఇలా బెదిరిస్తారా. న్యాయమూర్తినే తీసేయాలని పట్టుబడుతారా అంటూ ఏకిపారేశారు.

డీఎంకే పార్టీ అక్కడితో ఆగకుండా ఇండియా కూటమిలోని 120 మంది ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లాకు జస్టిస్ స్వామినాథన్ ను తొలగించాలని పిటిషన్ ఇచ్చారు. ఎంత దారుణం ఇది. ఈ రాతి స్తంభం మీద దీపం వెలిగిస్తే నష్టమేం లేదు. గతంలోనే దర్గా ప్రతినిధులు ఆ దీపం వెలగించడానికి ఒప్పుకున్నారు. స్వామినాథన్ తీర్పుపై ముస్లింలు ఎవరూ బయటకొచ్చి నిరసనలు చేయలేదు. కానీ డీఎంకే పార్టీ దీన్ని రాజకీయం చేసింది. ఆ పార్టీ ఆడుతున్న ఆటలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పావులుగా మారిపోయాయి. ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తే వొచ్చేదేముంది. అసలే కాంగ్రెస్ మీద యాంటీ హిందూ ముద్ర పడిపోయింది. ఇలాంటివి చేస్తే ఇంక ఆ పార్టీకి అతీ గతీ ఉండదు. ఒక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే తీసేయాలి అంటే.. రేపటి నుంచి ఏ తీర్పు ఇచ్చినా న్యాయమూర్తులను తీసేయాలని పార్లమెంట్ లో పట్టుబట్టాలా. అప్పుడు కోర్టులకు, జడ్జిలకు విలువేముంది. కాబట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడం మంచిది కాదు.

ఒక దీపం వెలిగించడానికి కూడా ఎన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం చెప్పడం ఏంటి. దాన్ని కావాలని నేషనల్ ఇష్యూ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు కనీసం దీపం వెలిగించలేని పరిస్థితులు తీసుకొస్తున్నారంటే రాబోయే రోజుల్లో వీళ్లు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని హిందువులు భయపడిపోయేలా పరిస్థితులు తయారయ్యాయి. కాబట్టి ఇలాంటి రాజకీయ పార్టీలనే రద్దు చేయాలంటున్నారు హిందూ భక్తులు.


Tags

Next Story