Supreme Court : దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి: సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు. ఆ నెయ్యి వాడలేదని టీటీడీ చెబుతోంది’ అని సుప్రీం తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com