Arvind Kejriwal : అధికారిక నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్

Arvind Kejriwal : అధికారిక నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్
X

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్‌ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలే ఉండడంతో కేజ్రీవాల్‌ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు. అనేక ప్రాంతాల్లో కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు ఈజీగా ఉంటుందని అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని కోరింది.

Tags

Next Story