PM Modi : మోడీ ప్రవేశపెట్టే ఆరు కీలక బిల్లులు ఇవే

PM Modi : మోడీ ప్రవేశపెట్టే ఆరు కీలక బిల్లులు ఇవే
X

మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తారు. 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తర్వాత సభ ముందుకు ఫైనాన్స్ బిల్లు-2024ను తీసుకొస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు వాయిదా పడతాయి.

మంగళవారం నాడు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండదు. మరో పక్క పార్లమెంటు సభ్యులు అత్యవసర ప్రజాప్రయోజన అంశాలను సభలో ప్రస్తావించడానికి ఆన్ లైన్ ద్వారా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన వాటిల్లోంచి ప్రతిరోజూ లాటరీ ద్వారా 20 మంది సభ్యులను ఎంపిక చేసి జీరో అవర్ లో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తారు. విషయ అత్యవసరతను బట్టి స్పీకర్ అనుమతిచ్చిన వారు కూడా మాట్లాడేందుకు వీలుంటుంది.

బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు-2024, బాయిలర్ బిల్లు-2024, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్లు-2024, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు-2024, రబ్బర్ (ప్రమోషన్ అండ డెవలప్ మెంట్) బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిని ఆమోదించడానికి చర్యలు చేపట్టింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ బడ్జెట్ ను కూడా ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సెషన్ లో విభజన బిల్లు ఆమోదం పొందనుంది. ఈ బిల్లులన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువగా ఉండేలా బ్యాంకింగ్ చట్టాలకు ప్రభుత్వం ఈ సమావేశాలలో సవరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story