Agnipath Scheme : అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పులు?
త్రివిధ దళాల్లో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటుండగా, ఈ సంఖ్యను 50 శాతానికి పెంచే అవకాశం ఉందన్నారు.
త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ 2022లో అగ్నిపథ్ (Agnipath) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన అనంతరం సర్వీస్ నుంచి తప్పుకొన్న అగ్నివీర్‌లకు పెన్షన్ సౌకర్యాలు ఉండవు. ఈ పథకంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. మిగతా 75శాతం అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి.
దాంతో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర బలగాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరతారని బీఎస్‌ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ పేర్కొన్నారు. వారికోసం 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నామని తెలిపారు. తర్వాత పలు రాష్ట్రాలు కూడా వారి సేవలు వినియోగించే దిశగా ప్రకటనలు చేశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com