CWC Meet : రేపే సీడబ్లూసీ సమావేశం.. కీలక నిర్ణయం

CWC Meet : రేపే సీడబ్లూసీ సమావేశం.. కీలక నిర్ణయం

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) ఈనెల 8వ తేదీన సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తెలిపాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ( Sonia Gandhi ), అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi ) సహా ముఖ్యనేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. లోక్ సభలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కనుంది.

Tags

Next Story