Khalistani Terrorist : రామమందిరంపై ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పిచ్చికూతలు..

Khalistani Terrorist : రామమందిరంపై ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పిచ్చికూతలు..
X

మళ్లీ రెచ్చిపోయాడు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ. ఇండియాలోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తామని బెదిరించాడు. అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈనెల 16, 17వ తేదీల్లో దాడులు చేయనున్నట్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడులు చేసేటపుడు దూరంగా ఉండాలంటూ కెనడాలోని హిందువులపైనా బెదిరింపులకు దిగాడు. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును మూసివేస్తారని.. భవిష్యత్తులో ఆ ఎయిర్‌పోర్టు పేరు కూడా మారుతుందని హెచ్చరించాడు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలో ఉన్న ఆలయ కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే అదే బ్రాంప్టన్‌ నగరంలోనే గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా వీడియోను రికార్డు చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే పన్నూ నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు జరిగిన సందర్భంగా ఎయిరిండియా విమానాలపై దాడి జరిగే అవకాశాలున్నాయని పన్నూ తెలిపాడు.

Tags

Next Story