Tamil Nadu : పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష.. ఖుష్బూ ఫైర్

తమిళనాడులో నెలసరి బాలికను తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటనపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఫైరయ్యారు. ‘ఈ ఘటన విచారకరం. నన్ను షాక్‌కు గురిచేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుగా లేదా?’ అని స్కూల్ సిబ్బందిని దుయ్యబట్టారు. నెలసరి అనేది సహజమని, మానసికంగా ఎదుగుదల లేని అధికారులకు బుద్ధి చెప్పాలని మండిపడ్డారు. ‘‘నెలసరి కారణంగా ఒక విద్యార్థినిని క్లాస్ రూమ్ బయటే కూర్చొపెట్టి పరీక్ష రాయించడం నిజంగా విచారకరం. నా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన నన్నెంతో షాక్‌కు గురి చేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఎక్కడ ఉన్నాం? ఇలాంటి పనులకు పాల్పడిన విద్యాసంస్థలు, అందులోని సిబ్బందికి ఏమాత్రం సిగ్గుగా అనిపించడం లేదా? వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ విద్యార్థినికి వారు క్షమాపణలు చెప్పాలి. నెలసరి అనేది సాధారణ, సహజమైన చర్య. మానసిక పరిపక్వత లేని ఇలాంటి అధికారులకు సరైన గుణ పాఠం నేర్పించాలి’’ అని ఆమె రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com