KK Survey Big Shock : కేకే సర్వేకు బిగ్ షాక్.. తప్పిన అంచనా

ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జాక్ట్ ఫిగర్‌కు దగ్గరగా ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన కేకే సర్వే ఇటీవల తేలిపోతోంది. ఢిల్లీలో ఆప్ కు అధికారం వస్తుందని, ఆ పార్టీ 44 సీట్లు గెలుస్తుందని ఇటీవల ఈ సర్వే అంచనా వేసింది. కానీ ఫలితాల్లో ఆప్ 22, బీజేపీ 48 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అటు 2024 హరియాణా ఎన్నికలపై ఈ సర్వే(కాంగ్రెస్ -75, బీజేపీ 11) అంచనా ప్రకటించగా, అసలు ఫలితాల్లో బీజేపీ (48) గెలిచింది. దీంతో ఎగ్జిట్‌పోల్స్ క్రెడిబిలిటీ చర్చగా మారింది.
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో మూడు పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్నా హస్తిన పీఠం దక్కకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆప్ కంచుకోటను బద్దలుకొట్టిన కమలదళం దేశ రాజధానిలో పాగా వేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బకొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com