Kolkata Case : ఒప్పించేది ఎలా? కోల్కతా నిందితుడికి నార్కో టెస్టుకు నో!
ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన అనేక మలుపులకు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా సంజయ్ రాయికి నార్కో టెస్టు చేపట్టేందుక సీబీఐకి కోల్ కతా హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఘటనకు సంబంధించి విషయాలు చెప్పించేందుకు ఆయనకు ఇప్పటికే పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎటూ తేల్చకపోవడంతో నార్కో పరీక్ష నిర్వహణకు అనుమ తివ్వాలని కోల్ కతా హైకోర్టుని సీబీఐ కోరింది. కాగా, సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో గత నెలలో నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థుల ను కూడా ప్రశ్నించిన సీబీఐ.. చివరకు సంజయ్ రాయ్ ను ప్రధాన నిందితుడిగా తేల్చింది. అయితే, ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సంజయ్ నుంచి సమాధానాలు రాకపోవడంతో సీబీఐ చివరి అస్త్రంగా నార్కో అనాలిసిస్ కు సిద్ధపడింది.
హిప్నోటిక్ లేదా సెమీ-కాన్షియస్ స్థితిని ప్రేరేపించే ఔషధాన్ని ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు వీలుంటుంది. ఈ విధానంలో సాధారణంగా ట్రూత్ సీరమ్ గా పిలిచే సోడియం పెంటోధాలు వాడుతారు. అయితే, ఈ విధానానికి కోల్కతా హైకోర్టు నిరాకరించడంతో సీబీఐ తల పట్టు కుంది. భవిష్యత్ కార్యాచరణపై సీబీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, గత వారం కోల్కతా కోర్టు నిందితుడి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించి.. జ్యుడిషీయల్ కస్టడీని సెప్టెంబర్ 20 వరకు పొడగించింది. ఇలాఉండగా, సేకరించిన సాక్ష్యాలను పరిశీలించేందుకు సీబీఐ.. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ సహాయం తీసుకుంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com