Kolkata Doctor Case : కోల్కతా డాక్టర్ నిందితుడు సంజయ్ కి 14రోజుల రిమాండ్

Kolkata Doctor Case : కోల్కతా డాక్టర్ నిందితుడు సంజయ్ కి 14రోజుల రిమాండ్
X

కోల్‌కతా జూనియర్ వైద్యురాలు హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు 14 రోజుల జైలు కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు హత్యాచార ఘటనకు ముందు రోజు సంజయ్ రాయ్‌ వైద్యురాలిని ఫాలో అయినట్లు ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

అలాగే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌ క్యాంపస్‌ ఖాళీ అవుతోంది. ఈ నెల 9న హత్యాచార ఘటన తర్వాత చాలామంది భయంతో క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హత్యాచారం జరగడానికి ముందు క్యాంపస్‌లో దాదాపు 160 మంది మహిళా జూనియర్‌ డాక్టర్లు ఉండేవారు... ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు.

Tags

Next Story