Kolkata Rape Case : కోల్‌కతా హత్యాచార ఘటన: నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ

Kolkata Rape Case : కోల్‌కతా హత్యాచార ఘటన: నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ
X

    కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌ని కోర్టు కస్టడీకి పంపింది. అదనపు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి మరో 14 రోజుల కస్టడీ విధించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో న్యాయం కోరుతూ 11 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న స్థానిక వైద్యులు ఈరోజు తిరిగి విధుల్లోకి చేరడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.

    Tags

    Next Story