జాతీయ

Assam: తప్పు చేశాడని తెలిసి కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన ఎస్సై..

Assam: తప్పు చేస్తే.. అది ఎవరైనా వారికి శిక్షపడాల్సిందే అని అనుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు.

Assam: తప్పు చేశాడని తెలిసి కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన ఎస్సై..
X

Assam: తప్పు చేస్తే.. అది ఎవరైనా వారికి శిక్షపడాల్సిందే అని అనుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు. ముఖ్యంగా న్యాయాన్ని కాపాడే వృత్తిలో ఉండేవారు ఇలా ఆలోచించడం చాలా ముఖ్యం. అందుకే తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియడంతో అతడి చేతికి బేడీలు వేసింది లేడీ పోలీస్. ఇది విన్నవారంతా తనను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

అస్సాం లోని నాగోన్ జిల్లాలో ఎస్సైగా పనిచేస్తోంది జున్మొని రభా. తనకు గతేడాది అక్టోబర్‌లో రాణా పగాగ్ అనే వ్యక్తితో నిశ్చాతార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశాయి కుటుంబాలు. అలాంటి సమయంలోనే పరాగ్ గురించి జున్మొనికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. నిరుద్యోగులను మోసం చేస్తూ పగాగ్ సొమ్ముచేసుకుంటున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వల వేస్తూ వారి దగ్గర డబ్బులు కాజేసేవాడు పగాగ్. అలా ఎంతోమందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న జున్మొని.. అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు తానే స్వయంగా పగాగ్‌ను అరెస్ట్ చేసింది. ఈ సమాచారం తనకు అందించిన వ్యక్తులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జున్మొని తెలిపింది.

Next Story

RELATED STORIES