Maharastra : విరిగిపడిన కొండచరియలు, 20 మంది మృతి

Maharastra : విరిగిపడిన కొండచరియలు, 20 మంది మృతి

మహారాష్ట్ర ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఒక మొత్తం గిరిజన గ్రామమే శిథిలంలో చిక్కుకుంది. సుమారు గ్రామంలోని 30కి పైగా కుటుంబాలు విలవిలలాడి పోయాయి. ఇళ్ల పై మట్టి పెళ్ళళ్ళు విరిగిపడడంతో గృహాలు నేలమట్టమయ్యాయి.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. ఈ ప్రమాదంలో కనీసం 17 నుంచి 20 మంది మృతి చెందే ఉండవచ్చని సీఎం వెల్లడించారు. దాదాపు 100 మంది శిధిలాల కింద చెక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.



గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు విరిగి పడినట్టుగా తెలుస్తుంది. గ్రామంలో గిరిజనులకు చెందిన 46 ఇళ్ళు ఉన్నాయని, అందులో నాలుగైదు ఇళ్ళు మినహాయించి మిగతా అన్ని ఇళ్ళు కొండ చరియలు విరిగిపడడంతో సమాధి అయ్యాయని చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల్లో గ్రామానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కాలినడకని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలికి సమీపంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో ఉండగా మరో రెండు బృందాలను కూడా సంఘటనా స్థలానికి పంపిస్తున్నారు .

దాదాపు 75 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే వర్షం వల్ల రెస్క్యూ ఆపరేషన్కు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని చోట్ల శిధిలలో 10 నుంచి 29 అడుగుల లోతులో ఉండడంతో వాటిని వెలికి తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. అయితే స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story