Ashok Chavan : అలవాటులో పొరపాటు.. చవాన్ మాటలకు నేతల నవ్వులు
ఇటీవలే బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కాంగ్రెస్ పార్టీని వీడిన ఒక రోజు తర్వాత ముంబయి బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్‌ను ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు అని సంబోధించారు.
'ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడికి ధన్యవాదాలు..." అని అశోక్ చవాన్ అన్నారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆయన టంగ్ స్లిప్ అయ్యారన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వడమ మొదలెట్టారు.
తర్వాత జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతూ, "నేను ఇప్పుడే (బీజేపీలో) చేరాను. అందుకే ఈ పొరపాటు. 38 ఏళ్ల కాంగ్రెస్‌లో బీజేపీలో చేరి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను" అని చవాన్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఇది నా మొదటి విలేకరుల సమావేశం, దయచేసి అర్థం చేసుకోండి’’ అని ఆయన అన్నారు. 'నేను కాంగ్రెస్‌తో కలిసి ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఉన్నాను.. ఇప్పుడు నా ప్రయాణంలో బీజేపీని గెలిపించేలా చూస్తాను. అది లోక్‌సభ ఎన్నికలైనా.. రాష్ట్ర ఎన్నికలనా.. పార్టీలో ఎవరికీ వ్యతిరేకంగా వ్యాఖ్యానించాలనుకోవద్దు" అని చవాన్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com