Google Layoffs : గూగుల్లో లే ఆఫ్స్.. వందల మంది ఉద్యోగాలు ఔట్

టెక్ దిగ్గజ సంస్థ భారీ సంఖ్యలో లేఆఫ్స్ కు తెరలేపింది. తమ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగుల పై ఈ వేటు వేసినట్టు సమాచారం. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంత మందిని తొలగించారన్నది కచ్చితంగా తెలియరావడం లేదు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశంతోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతున్నట్టు తెలు స్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రి యలో భాగంగా గత రెండేళ్లలో గూగుల్ అనేక మందిని విధుల నుంచి తప్పించింది. గతేడాది డిసెంబరులో మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందికి లేఆఫ్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఐర్ విభాగం, క్లౌడ్ ఆర్గనైజేషన్లో కొంతమందిని తొలగించింది. ఖర్చు తగ్గింపులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో విదేశీ నిపుణులపై ట్రంప్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో ఈ లేఆఫ్ వార్తలు ప్రాధా న్యం సంతరించుకున్నాయి. అటు మరో టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా మే నెలలో మరోసారి ఉద్యోగాల కోతలు చేపట్టనున్న ట్లు కథనాలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com