Leopard : శ్రీశైలంలో చిరుత కలకలం

Leopard : శ్రీశైలంలో చిరుత కలకలం
X

శ్రీశైలంలో సోమవారం వేకువజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం క్షేత్రంలోని పాతా ళగంగ మార్గంలో 110 కాటేజ్ వద్ద దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించిది. ఇంటి వెనుక ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళ్లి, కిందకు దూకి ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది.

కుక్క గట్టిగా అరవడంతో లైట్ వేశారు. దీంతో కుక్కను వదిలేసి ప్రహరీ గోడ దూకి చిరుత వెళ్లిపోయింది. చిరుత పులి సంచారం మొత్తం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది. చిరుత సంచారంతో స్థానికులు, భక్తులు భయాందోళన చెందుతున్నారు.

Tags

Next Story