Ayodhya : అయోధ్యలో రూ.50లక్షల విలువైన లైట్లు చోరీ!

Ayodhya : అయోధ్యలో రూ.50లక్షల విలువైన లైట్లు చోరీ!
X

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సర్కారు సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు చోరీ చేశారు. వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్టు పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం రామ్‌పథ్‌లో 6,400 వెదురు లైట్లు, భక్తి ప‌థంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరవాత అయోధ్యకి భక్తుల తాకిడి పెరిగింది.

Tags

Next Story