Lok Sabha : స్పోర్ట్స్, ఐటీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Lok Sabha : స్పోర్ట్స్, ఐటీ బిల్లుకు లోక్ సభ ఆమోదం
X

కొత్త ఇన్ కమ్యాక్స్ (ఐటీ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బైజయంత్ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నవీకరించిన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చ జరగకుండానే సభామోదం పొందింది. ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఐటీ చట్టం 1961 స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవ రిలోనే కేంద్రం లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టింది. విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. కమిటీ ప్రతిపా దనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. ఆదాయపు పన్ను (నం.2)బిల్లు 2025ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. గత శుక్రవారం

పాత బిల్లును విత్ డ్రా చేసుకున్నారు. సెలక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమో దించినట్లు మంత్రి వెల్లడించారు. మరో రెండు బిల్లులు కూడా ప్రతిపక్షాల రభస మధ్యే యాంటీ డోపింగ్, స్పో ర్ట్ బిల్లులను లోక్సభ ఆమోదించింది. వీటిపై సుదీర్ఘ, అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఉభయ సభల్లో చెరో 2 రోజులు సమయం కే టాయించామని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడిం చారు. అయితే కీలకమైన ఈ బిల్లులపై చర్చిం చకుండా విపక్షాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైనిరసన చేపట్టాయని ఆయన పేర్కొన్నారు.

Tags

Next Story