Lunar Eclipse: ఒకేరోజు చంద్రగ్రహణం, సూపర్ మూన్

Lunar Eclipse: ఒకేరోజు చంద్రగ్రహణం, సూపర్ మూన్
X
భారతదేశంలో కనపడని చంద్ర గ్రహణం

బుధవారం రాత్రి ఆకాశంలో అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం రేపు ఏర్పాటు కానుంది. అయితే ఈ చంద్ర గ్రహణం చాలా ప్రత్యేకం కానుంది ఎందుకంటే ఒకే రోజు ఆకాశంలో సూపర్ మూన్, చంద్ర గ్రహణం ఏర్పాటు కానున్నాయి. రేపు రాత్రి వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం.

బుధవారం ఏర్పాటు కానుంది పాక్షిక గ్రహణం కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇది కనిపించనుంది. కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే సూర్యుడి కాంతి భూమి కారణంగా చంద్రుడిపై పడదు. దీన్నే చంద్ర గ్రహణంగా పిలుస్తారు. నిజానికి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు.. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది.

భూమి నీడ చంద్రుడిపై పడటాన్నే చంద్ర గ్రహణంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటలకు ప్రారంభం కానున్న ఈ గ్రహణం.. 10.17 గంటలకు ముగియనుంది. మొత్తం గ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఈసారి పాక్షిక చంద్రగ్రహణం దర్శనం ఇవ్వనుంది. మరోవైపు బుధవారం చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా దర్శనం ఇవ్వనున్నాడు. దీన్నే సూపర్‌ మూన్‌గా పిలుస్తుంటారు. ఈ సూపర్‌ మూన్‌ను హార్వెస్ట్‌ మూన్‌గా పిలుస్తూ ఉంటారు. ఈ చంద్ర గ్రహణం యూరప్‌, ఆఫ్రికా.. ఉత్తర, దక్షిణ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపించనుంది.

Tags

Next Story