Maharashtra : షిండే వర్గంపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. షిండే వర్గం ఏక పక్ష నిర్ణయాలను తప్పు పట్టింది ధర్మాసనం. గవర్నర్ తీరు పైనా రాజ్యాంగ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది రెండు వర్గాల విభేదాలపై స్పీకర్ అప్రమత్తంగా ఉండాల్సిందని అభిప్రాయపడింది ధర్మాసనం. గోగావాలేను విప్‌గా నియమించడంపై కూడా సీరియస్ అయింది.ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండాల్సిందన్న ధర్మాసనం తిరిగి ఉద్దవ్ సర్కార్‌ను పునరుద్దించడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. రాజీనామా చేయకుండా పోరాడితే అనుకూలంగా తీర్పు వచ్చేదని వ్యాఖ్యానించింది.పార్టీ విబేధాలను ప్రభుత్వంపై రుద్దకూడదని,పార్టీ మాత్రమే విప్‌లను నియమిస్తుందని కామెంట్ చేసింది సీజేఐ ధర్మాసనం. మరోవైపు రాజ్యంగ ధర్మాసనం తీర్పుపై స్పందించివది శివసేన ఠాక్రే వర్గం. ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com