Maharashtra :ఆడి కారుతో ఢీకొట్టి పరారైన బిజేపి నేత కుమారుడు

Maharashtra :ఆడి కారుతో ఢీకొట్టి పరారైన బిజేపి నేత కుమారుడు
పోలీసులు విచారణ జరిపి నిందితులకు శిక్ష విధించాలన్న తండ్రి, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్

తన ఆడి కారుతో నాగ్‌పూర్‌లోని రాందాస్‌పేట ప్రాంతంలో పలు వాహనాలను ఢీకొట్టిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు సంకేత్ బవాంకులే సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అయిన అర్జున్ హవారే, రోణిత్ చింతాన్వర్ ఇద్దరూ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆడికారు తొలుత ఫిర్యాదుదారు జితేంద్ర సొంకాంబలే కారును తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ మోపెడ్‌పై వెళ్తున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. బీర్ బార్ నుంచి వ‌స్తున్న స‌మ‌యంలో ఆడీ కారు బీభ‌త్సం సృష్టించింది. అరెస్టు చేసిన వ్య‌క్తుల నుంచి ర‌క్త‌పు శ్యాంపిళ్ల‌ను తీసుకున్నారు.

బైక్‌ను ఢీకొన్న ఘ‌ట‌న‌లో.. ఆ బైక్ వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. వాహ‌నాల‌ను ఢీకొన్న త‌ర్వాత మాన‌క్‌పూర్ బ్రిడ్జ్ వ‌ద్ద ఆడీ కారు ఆగిపోయింది. స‌రిగ్గా సెంట‌ర్ పాయింట్ హోట‌ల్ వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల కేసు రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ అనామికా మీర్జాపూర్ తెలిపారు.

ప్రమాద సమయంలో కారులో సంకేత్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. సొంకాంబలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిలుపై వారిని విడిచిపెట్టారు. ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు బీజేపీ మహారాష్ట్ర చీప్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టి, నిందితులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని, తాను ఏ పోలీసు అధికారితోనూ మాట్లాడలేదని తెలిపారు.

Tags

Next Story