Tomato: సిరులు కురిపించిన టమాట

Tomato: సిరులు కురిపించిన టమాట
కోటీశ్వరుడైన మహారాష్ట్ర రైతు

దేశంలో అనూహ్యంగా పెరిగిపోయిన టమాట ధరలు సామాన్యుడి జేబును గుల్ల చేస్తుండగా కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నది. అన్నీ కలిసొస్తే ఇప్పటికీ వ్యవసాయాన్ని మించిన వృత్తి, రైతన్నలను మించిన సంపాదనపరులు మరొకరు ఉండరని ఈ ఘటన నిరూపించింది. మహారాష్ట్రలో ఒక రైతు నెల రోజుల వ్యవధిలో టమాటాల అమ్మకం ద్వారా కోటీశ్వరుడైపోయాడు. జున్నర్‌ తాలూకా పరిధిలోని పచగఢ్‌ గ్రామానికి చెందిన టమాటా రైతు ఈశ్వర్‌ గైకార్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం.

చ్‌గర్‌ జిల్లాకు చెందిన ఈశ్వర్‌ గేకర్‌ అనే రైతు జూన్‌ 11 నుంచి జూలై 18 వరకు మూడు కోట్ల రూపాయలను టమాటాల విక్రయం ద్వారా ఆర్జించాడు. పొలంలో ఇంకా కొంత పంట కోయాల్సి ఉందని, అది అమ్మితే మరో 50 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపాడు. తాను మొత్తం 18 వేల బాక్స్‌లు.. ఒక్కో బాక్స్‌లో 20 కేజీల టమాటాను 700 నుంచి 2200 రూపాయల వరకు అమ్మినట్టు చెప్పాడు. 12 ఎకరాల పొలంలో పండించిన ఈ టమాటా సాగుకు మొత్తం 40 లక్షల వ్యయం అయ్యిందని తెలిపాడు. టమాట సాగులో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఈ ఏడాది మేలోనే అతి తక్కువ ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రాక పెద్దమొత్తంలో టమాటాలను పారబోసినట్టు తెలిపాడు.


ఆ నెలలో టమాటాల బాక్స్‌ ధర కిలో రూ 2.50 చొప్పున 50 రూపాయలు మాత్రమే పలికిందని, అలాగే 2021లో ఈ పంట ద్వారా రూ.15, 16 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఈసారి లక్ష్మీకటాక్షం లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు.

కిలో టమాటా ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గత నెల రోజుల్లో ఈ రైతు రాబడి అక్షరాలా రూ.3 కోట్లు. తనకు 16 ఎకరాల భూమి ఉందని, చాలా ఏళ్లుగా 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నానని గైకార్‌ తెలిపారు. గతంలో పలు సందర్భాల్లో గిట్టుబాటు కూడా కాలేదని, 2021లో రూ.15-16 లక్షలు నష్టపోయానని తెలిపాడు. ఈ ఏడాది మే నెలలోనూ టమాటాలు పారబోశామని. గత నెల రోజులుగా ధర స్థిరంగా ఉండటంతో జూన్‌ 11 నుంచి జులై 18 మధ్య దిగుబడితో రూ.3 కోట్ల రాబడి సాధించానని ఈశ్వర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story