Maharastra : స్మశానంలో వివాహం

Maharastra : స్మశానంలో వివాహం
కాటికాపరి కూతురికీ పుట్టింట్లోనే పెళ్లి

మహారాష్ట్రలో ఓ అరుదైన వివాహం జరిగింది. ఓ ప్రేమ జంట శ్మశానంలో పెళ్లి చేసుకుంది. ఇరువురి కుటుంబ సభ్యులు సంపూర్ణ అంగీకారంతోనే అందరూ కలిసి స్మశానంలో వివాహం జరిపించారు. ఈ వింత తెలుసుకుని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్నారు. ఆయనది మహాసంజోగీ సామాజిక వర్గం. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు.

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని రహతా ప్రాంతంలో గంగాధర్ అనే వ్యక్తి స్థానిక స్మశానవాటికలో కాటి కాపరిగా పని చేస్తుండేవాడు. ఇతడు చాలా ఏళ్లుగా ఇక్కడే పని చేస్తూ అందులోనే కుటుంబంతో కలిసి నివాసం ఉంతున్నాడు. ఇక గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి పెరిగింది. 12వ తరగతి వరకూ చదువుకుంది. అయితే, ఆమె శిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, మొదట్లో యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు.

ఆ తర్వాత ఒప్పుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే చాలా ఏళ్లుగా గంగాధర్ స్మశానంలోనే ఉండడంతో ఇక్కడే తన కూతురు వివాహం చేయాలని అనుకున్నాడు. పిల్లాడి తల్లి దండ్రులు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా స్మశానవాటికలోనే వివాహం జరిపించారు. వీరి పెళ్లికి బంధువులంతా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు

Tags

Read MoreRead Less
Next Story