Asaduddin Owaisis : మజ్లిస్ రాష్ట్ర కార్యదర్శి కాల్చివేత

నేరాల అడ్డా బిహార్ లో మరో దారుణం జరిగింది. గోపాల గంజ్ లో ఫిబ్రవరి 12 రాత్రి ఫైరింగ్ జరిగింది. బిహార్ ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియాను పిట్టను కాల్చినట్టు కాల్చేశారు దుండగులు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారు.
గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్ ను కూడా కాల్చి చంపారని అసద్ గుర్తు చేశారు. సీఎం నితీష్ కుమార్ శాంతిభద్రతలు పరిరక్షించడంలో ఫెయిలయ్యారని ఫైరయ్యారు. ''కుర్చీ కోసం జరిగిన పోటీలో మీరు మీ కుర్చీని కాపాడుకున్నారుగా, ఇప్పటికైనా కొంత పనిచేయండి. మా నాయకులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?'' అని అసద్ ప్రశ్నించారు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com